ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 3.68 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. దీతో గత ఏడాది ఇదే సమయానికి 2.9 లక్షల మంది చేరగా ఈ సారి సంఖ్య పెరిగింది. ఆగస్టు నెలాఖరు వరకు అడ్మిషన్లు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.