తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో SIR గురించి సుదీర్ఘంగా చర్చించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. SIR జరిగే క్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అధినేత కేసీఆర్ సూచించారని అన్నారు. మహిళా రిజర్వేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్దీతో ఈ బిల్లును అమలు చేయాలని తీర్మానం చేశామన్నారు.