బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నాయకులకు బుధవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ గుర్తు కారని, ఎప్పుడు ఏ గేర్ మార్చాలో తమకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లను ఎదుర్కొనేందుకు తాము చాలని, కేసీఆర్ అవసరం లేదని కేటీఆర్ అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు కేసీఆర్ కచ్చితంగా బయటకు వస్తారని, అప్పటివరకు తామే కాంగ్రెస్‌కు సమాధానం చెబుతామని ఆయన స్పష్టం చేశారు.