పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల: ఆర్టీసీ ఛార్జీలు పెంచేది లేదని స్పష్టీకరణ

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచే ఆలోచన లేదని సంస్థ ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పాత ఛార్జీలే వర్తిస్తాయని, భవిష్యత్తులో ఇంధన ధరలు స్థిరపడ్డాక పరిస్థితులను బట్టి ఛార్జీల సవరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లీటర్ డీజిల్‌పై రూ.6 పెరగడంతో ఆర్టీసీపై నెలకు రూ.7.68 కోట్ల అదనపు భారం పడుతున్నా, సామాన్యులపై మరో భారం వేయడానికి సంస్థ సిద్ధంగా లేదని పేర్కొన్నారు. రోజుకు రూ.36 లక్షల అదనపు భారం పడుతున్నా, ఈ నష్టాన్ని ఆర్టీసీనే భరిస్తుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్