హైదరాబాద్ జిల్లా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హఫీజ్‌పేట్‌లోని మార్తాండనగర్‌లో కిరాయికి ఉండే శ్రీను, నీలా దంపతుల కుమారుడు అభి (4) ఇంటి వద్ద ఆడుకుంటూ పక్కనే ఉన్న ఓ తెరిచి ఉన్న నీటి సంపులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీను ఉదయం కూలి పనులకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.