రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని వెల్వర్తి గ్రామ శివారులో సోమవారం ఒక సిమెంట్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. తాండూరు నుండి బాచుపల్లికి వెళ్తున్న ఈ ట్యాంకర్ మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.