రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఎనికేపల్లి సమీప కమ్మెట ఎక్స్ రోడ్‌లో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల కోసం ధర్నాకు దిగారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో విద్యార్థులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బస్సులు సమయానికి రాకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. వికారాబాద్ ఆర్టీసీ ఎండీకి ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.