నేడు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 7.30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి, గ్రహణం పూర్తయిన తర్వాత రాత్రి 7 గంటలకు సంప్రోక్షణతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్