మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. మరోసారి నిందితుల సిట్ కస్టడీ పొడిగింపు

మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, వ్యాపారవేత్త నమిత్ శర్మలను సిట్ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ గురించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఈ విచారణ జరుగుతోంది. ఉప్పరపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతితో వీరిని నాలుగు రోజుల పాటు విచారించనున్నారు. చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న ముగ్గురిని బుధవారం సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని, శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు విచారణ కొనసాగనుంది. విచారణ సమయంలో నిందితులతో పాటు వారి న్యాయవాదులు కూడా హాజరు కావచ్చని కోర్టు తెలిపింది.

సంబంధిత పోస్ట్