చేసిన దొంగతనం పట్టించిందని మహిళ హత్య

చేవెళ్లలోని ఫరా కాలేజీ సమీపంలో దారుణ హత్య జరిగింది. సెంట్రింగ్ మేస్త్రి గురువులు వద్ద నర్సింహుతోపాటు అతని భార్య పద్మ, కెతావత్ శివ పని చేస్తున్నారు. ఈనెల 20న గురువులు ఫోన్ పోయి, అందులో నుంచి రూ.45 వేలు బదిలీ అయ్యాయి. శివపై అనుమానం వ్యక్తం చేస్తూ గురువులతోపాటు పద్మ(28) కలిసి ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో శివ నేరం ఒప్పుకోవడంతో ఫోన్ దాచిన ప్రాంతానికి వారిని తీసుకెళ్లి తనపై ఫిర్యాదు చేశారంటూ గొడవకు దిగాడు. గురువులు బైక్ తీసుకొస్తానని వెళ్లి తిరిగి వచ్చే సరికి పద్మను హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕