గాంధీభవన్‌లో మంగళవారం కాంగ్రెస్ నేతలు ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చోవడం విషయంలో వీరిద్దరి మధ్య వివాదం రేగింది. ఈ క్రమంలో ఉస్మాన్ తోసేయడంతో ఫిరోజ్‌ఖాన్ కిందపడ్డారు. అనంతరం ఇరువర్గాలు చొక్కాలు పట్టుకుని తోపులాటకు దిగాయి. సీనియర్ నేత వీహెచ్‌ను కూడా తోసేసే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.