సైబరాబాద్‌ పోలీస్ ప్రత్యేక డ్రైవ్.. 587 కేసులు నమోదు

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెంబర్ ప్లేట్లు, అనుమతి లేని సైరన్లు, ఫ్లాష్ లైట్లపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డీజీపీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 587 కేసులు నమోదు చేసి, రూ.1.34 లక్షల జరిమానా విధించారు. ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు, అనధికార సైరన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్