తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) డాక్టర్స్ సెల్, మెడికల్ & హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డా. శ్రీప్రకాశ్ విన్నకోటను నియమించారు. ఈ నియామక ఉత్తర్వును మంగళవారం TPCC డాక్టర్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ డా. ఎం. రాజీవ్ MBBS, MD గారు జారీ చేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ లోక్‌సభ సభ్యులు శ్రీ సురేష్ షెట్‌కర్ గారు మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ బండి రమేష్ గారు డా. శ్రీప్రకాశ్ విన్నకోటను అభినందించారు. వైద్య రంగంలో ఆయన సేవలు, ప్రజారోగ్యంపై ఆయనకున్న నిబద్ధతను వారు ప్రశంసించారు. డా. శ్రీప్రకాశ్ విన్నకోట ఈ బాధ్యతలో డాక్టర్స్ సెల్‌ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని, అలాగే శ్రీ బి. మహేష్ కుమార్ గౌడ్ గారు (MLC & అధ్యక్షుడు – TPCC) నాయకత్వంలో పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో విశేషంగా సేవలందిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డా. శ్రీప్రకాశ్ విన్నకోట పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తనపై ఉంచిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని, సంస్థను బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.