ధూల్‌పేట్ శివలాల్ నగర్‌లో ఆదివారం ఎస్‌టీఎఫ్ బృందం భారీ గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఒడిశా నుంచి అక్రమంగా తరలించిన 30.15 కేజీల గంజాయిని అమ్మకాలకు సిద్ధం చేస్తుండగా ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12 మందిపై కేసు నమోదు చేయగా, సంగీత్ సింగ్, హరికృష్ణ, సునీల్ సింగ్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 15 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. పట్టుకున్న గంజాయి, నిందితులను ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.