చలో అసెంబ్లీ పిలుపు: బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేట్ బషీరాబాద్ పరిధిలో ఉద్యమ సంఘాలు ఇచ్చిన “చలో అసెంబ్లీ” పిలుపు నేపథ్యంలో, పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌కు చెందిన ప్రముఖ నాయకులు సంపత్ మాధవరెడ్డి, అశోక్ రెడ్డి, కుంట సిద్దిరాములు లను పేట్ బషీరాబాద్ పోలీసులు అర్థరాత్రి సమయంలో అరెస్టు చేశారు. అనంతరం వారిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచేందుకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

సంబంధిత పోస్ట్