మాదిగ బంధుమిత్ర సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ చూడి బజార్‌లో సమావేశం జరిగింది. ప్రధాన కార్యదర్శి సుమన్ ఎల్లేష్ పిలుపుతో స్థానిక కుల పెద్దలు, బస్తీ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ 2016లో ప్రారంభమైన రామ్ మనోహర్ లోయ అంబేద్కర్ భవనం పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీ ప్రజల మద్దతుతో నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.