అభిప్రాయాలలో తేడాలుంటే వాటిని నాగరిక పద్ధతిలో వ్యక్తపరచాలని, అమానుషంగా వ్యవహరించడం తగదని MLC కోదండరాం గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో తెలిపారు. ఏదైనా అంశంపై భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించాలే కానీ, దాడులకు దిగడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ధోరణులను సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, సంభాషణల ద్వారానే సమస్యలకు పరిష్కారం వెతకాలని ఆయన సూచించారు.