హైదరాబాద్‌లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకుండా నీటి ట్యాంకర్లను బుక్ చేసుకుంటే రెట్టింపు రేటు వసూలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం హెచ్చరించారు. నగరానికి ప్రస్తుతం 650 MGD నీరు సరఫరా అవుతోందని, రూ. 7 వేల కోట్లతో గోదావరి ఫేజ్–2, 3 పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటి సరఫరాపై నిర్లక్ష్యం వహించిందని విమర్శించిన ఆయన, నీటి అంశంపై విపక్షాలు రాజకీయాలు చేయడం తగదన్నారు.