గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో మెరిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అమర్నాథ్ యాత్ర సులువైందని పేర్కొన్నారు. యాత్ర మార్గంలో రోడ్డు సహా అన్ని సౌకర్యాలు సమకూరాయని వెల్లడించారు. యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ముస్లింలకు ఉపాధి దొరికిందని వ్యాఖ్యానించారు.