బేగంబజార్‌లో సోమవారం హోలీ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బేగంబజార్ హోలీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మార్వాడీలు, ఉత్తర భారతీయులు, గుజరాతీలు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్గానిక్ రంగులతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. కోల్సావాడి మాలి సమాజ్ భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ మార్కెట్ అంతా కొనసాగింది. బ్యాండ్ మేళాల సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సవ వాతావరణాన్ని సృష్టించారు.