కవిత కొత్త పార్టీ.. ఘాటుగా స్పందించిన మంత్రి వివేక్

తెలంగాణలో కవిత కొత్త పార్టీ పెట్టడంపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రంగా స్పందించారు. కల్వకుంట్ల కుటుంబంలోని ఆస్తి గొడవల కారణంగానే కవిత ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కవితే స్వయంగా బయటపెట్టారని పేర్కొన్న మంత్రి, దీనిపై కేంద్రం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కవిత కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సంబంధిత పోస్ట్