హోలీ సందర్భంగా గంజాయి బంగ్ పట్టివేత

హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని ధూల్‌పేట్-నాంపల్లి ప్రాంతాల్లో ఎస్టీఎఫ్, ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2.622 కిలోల గంజాయితో తయారుచేసిన బంగ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మూడు కేసులు నమోదు చేసి, ఆరుగురిని అరెస్ట్ చేశారు. బేగంబజార్, చుడీబజార్ సహా మూడు చోట్ల పట్టుబడిన బంగ్‌ను ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్