ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శుక్రవారం 'విక్టోరియా పార్లమెంట్'ను సందర్శించారు. అక్కడ 'లీ తార్లామిస్', 'షీనా వాట్' ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. తెలంగాణలో అమలు జరుగుతున్న ప్రగతిశీల విధానాలు, డిజిటల్ ఇనిషియేటివ్స్ గురించి మంత్రి వివరించారు. 'తెలంగాణ – విక్టోరియా' మధ్య సహకారాన్ని పెంపొందించాలని మంత్రి కోరగా, భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నామని వారు తెలిపారు.