తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌ను ఓయూ విద్యార్థి నేత, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటపోతుల రమేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ పోలీసు శాఖను సమర్థవంతంగా ముందుకు నడిపించాలని, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో, యూనివర్సిటీ క్యాంపస్‌లలో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసుల పాత్ర కీలకమని అన్నారు.