చలానాల తప్పించుకోవాలని నంబర్ ప్లేట్ మార్పు.. మరో అరెస్ట్

చలానాల నుంచి తప్పించుకోవడానికి హోండా యాక్టివా నంబర్ ప్లేట్‌ను మార్చిన బలరామ్ (59)ను ఆదివారం సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. AP09CH నంబరును AP09CMగా మార్చడంతో అసలు హోండా యూనికార్న్ యజమాని ఎస్. విజయ్‌కు తప్పుడు చలానాలు వెళ్లాయి. ANPR కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నంబర్ ప్లేట్లలో మార్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ సీపీ ట్రాఫిక్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్