హైదరాబాద్ సిటీ సిసిఎస్ ప్రత్యేక క్రైమ్ టీమ్, గోషామహల్, అఫ్జల్‌గంజ్ పోలీసులు మంగళవారం నాడు నకిలీ టీ పొడి, సర్ఫ్ పౌడర్, గుడ్‌నైట్ రీఫిల్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 1340 రెడ్ లేబుల్ టీ ప్యాకెట్లు, 950 టైడ్ ప్యాకెట్లు, 3600 గుడ్‌నైట్ రీఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ నుంచి తక్కువ నాణ్యత గల సరుకును తెచ్చి, వాటిని అసలైన బ్రాండ్లుగా విక్రయిస్తున్నారని సీసీఎస్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.