లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్‌లో ఉన్న హోటల్ గ్రాండ్ లాడ్జ్‌లో యువతి రేణుక(26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫరూక్(34)తో కలిసి హోటల్‌లో గది తీసుకున్న ఆమె ఉరివేసుకుని కనిపించిందని ఫరూక్ శుక్రవారం పోలీసులకు తెలిపాడు. అయితే, ఇది హత్యేనని రేణుక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫరూక్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.