శుక్రవారం బేగంబజార్ ఛత్రి చౌరస్తా వద్ద శ్రీరామనవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. డీజే భక్తి పాటలకు యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. చౌరస్తా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి, కాషాయ జెండాలను ఊపుతూ శోభాయాత్రను కన్నుల పండుగగా మార్చారు. ఈ ఉత్సవ వాతావరణం అందరినీ అలరించింది.