హైదరాబాద్ మెట్రో విధుల్లో ట్రాన్స్‌జెండర్లు (వీడియో)

హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా విభాగంలో ట్రాన్స్‌జెండర్లను నియమించింది. ప్రత్యేక శిక్షణ పొందిన 20 మంది ట్రాన్స్‌జెండర్లు డిసెంబర్ 1 నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో రుచిత, జాహ్నవి అనే ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు విధుల్లో చేరారు. మెట్రోలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ట్రాన్స్‌జెండర్లు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్