తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డీజీతో విచారణ జరిపించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డా. రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన, నాలుగు ఏళ్ల పరారీ తరువాత లక్షల్లో జీతంతో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన లచ్చిరెడ్డిపై నిఘా వేసి విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.