టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో 'అందుబాటులో ప్రజా ప్రతినిధుల' కార్యక్రమం గురువారం హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో వెంటనే చర్చిస్తూ స్పందించిన ఎమ్మెల్యే, ప్రజల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.