సర్పంచ్ ఎన్నికల వేళ.. వార్డు అభ్యర్థి మృతి

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కంసాన్ పల్లి గ్రామంలో ఆవ శేఖర్ అనే యువకుడు రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. నాలుగో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న శేఖర్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని కొందరు ఒత్తిడి తెచ్చారని, బెదిరించారని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం కనిపించకుండా పోయిన శేఖర్ మృతదేహం రైలు పట్టాలపై లభ్యం కావడంతో ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్