రంగారెడ్డి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

బుధవారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కందుకూరు మండలం కొలనూడ గ్రామానికి చెందిన ఆదర్ల రాజు (28) అనే ట్రాక్టర్ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చింతుల్ల గ్రామ పరిధిలో మృతదేహం కనిపించడంతో, గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేశారని మృతుని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్