గుర్తుతెలియని వాహనం ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఉపాధ్యాయుడు మృతి చెందాడు. యాచారం గ్రామానికి చెందిన మస్కు సంతోష్ కుమార్ (30) చౌదర్ పల్లి, గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళుతుండగా విద్యుత్ సబ్ స్టేషన్ దాటగానే గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో  అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕