ఏపీ మంత్రి లోకేశ్ బనకచర్ల కట్టి తీరుతామని అంటూంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మాట్లాడట్లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ వాళ్ళు బనకచర్ల కడుతామంటేనే మేము అడ్డు చెప్పేది అని రేవంత్ రెడ్డి అన్నారు. లోకేష్ ఏమో మేము కట్టే తీరుతామని అంటున్నారు. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని మాకు అర్థం అవుతుందని హరీష్ రావు మండిపడ్డారు.