బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.... వ్యక్తి మృతి

నగరంలోని బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందగా… మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో కారులో ఉన్నవారు వెహికిల్ ను అక్కడే వదిలేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్