బంజారాహిల్స్‌లో బాల్క సుమన్‌పై కేసు!

సింగరేణి భవన్‌పై దాడికి ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదైంది. సింగరేణి భవన్ జూనియర్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. గత నెల 26న నాంపల్లిలో నమోదైన ఈ కేసు బుధవారం బంజారాహిల్స్‌కు బదిలీ అయింది. గత నెల 30న అరెస్ట్ అయిన సుమన్‌ను 3 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు గురువారం పిటిషన్ దాఖలు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్