జూబ్లీహిల్స్: త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు రూ. 1 కోటి, ధృతి కేసరికి రూ. 10 లక్షలు, హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి తలా రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం త్రిషను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్