పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని యన్నంపేట వంతెన వద్ద శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న కిషోర్ (20) అనే ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. అతనితో పాటు ప్రయాణిస్తున్న విజయ అనే యువతి తీవ్రంగా గాయపడింది. మృతుడు బి.ఎన్. రెడ్డినగర్ లో నివాసముంటూ ఇబ్రహీంపట్నంలోని సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బంధువైన యువతిని పరీక్షకు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.