నేడు సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం సిట్ విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్ నందినగర్‌‌లోని ఆయన నివాసంలోనే మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విచారణ బృందం ప్రశ్నించనుంది. కాగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని కేసీఆర్ చేసిన వినతిని సిట్ తిరస్కరించింది. మరోవైపు కేసీఆర్‌ సిట్ విచారణకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళన చేపట్టనున్నాయి.

సంబంధిత పోస్ట్