ఫ్యూచర్ సిటీ: 56 గ్రామాలకు పంచాయతీల అధికారం రద్దు

ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం భారీ ప్రణాళిక రచించి, RR(D)లోని 56 గ్రామాలను FCDA పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు, లేఅవుట్లకు ఇకపై పంచాయతీల సంతకాలు చెల్లవు. గ్రామసభల ప్రమేయం లేకుండానే సాగు భూములను కమర్షియల్ జోన్లుగా మార్చే అధికారం బోర్డుకే దక్కింది. భూములపై పూర్తి పట్టు సాధించేందుకే ఈ 'సూపర్ బాడీ'ని ఏర్పాటు చేశారని, అభివృద్ధి పేరుతో పల్లెల హక్కులను కాలరాస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్