ఒక విశ్లేషకుడి(ప్రొ.నాగేశ్వర్) వ్యాఖ్యలతోనే ఈ గొడవంతా మొదలైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ విశ్లేషకుడిపై తనకు గౌరవం ఉందని, తాను అమిత్‌షాతో మాట్లాడినట్లు అది ఆయన విన్నట్లు ఓ మీడియాలో వచ్చిన వార్తలను తాను ఖండించానన్నారు. అయితే మళ్లీ అవే వ్యాఖ్యలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లైనా ఆంధ్రోళ్లను ఎంతకాలం నిందిస్తారని ఆయన ప్రశ్నించారు.