అధిక లాభాల పేరుతో ఫేక్ యాప్ 'కోస్తా వెల్ గ్రోన్' ద్వారా మోసాలకు పాల్పడిన మనీష్ కుమార్ శర్మను హైదరాబాద్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అతనిపై దేశవ్యాప్తంగా 114 కేసులు నమోదయ్యాయి. ఇందులో 22 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.