టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటనతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించారు.