జనసేన పార్టీ తెలంగాణలో ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని సమస్యలపై గళమెత్తుతామని, ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. 'నేను ఇప్పటివరకు నిర్ణయించుకోలేదు. నా ప్రేమను శంకిస్తున్నారు కాబట్టి చెబుతున్నా. తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం' అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై పోరాడతామని ఆయన పేర్కొన్నారు.