నేడు డిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ కేసు విచారణ

నేడు ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పర్సనాలిటీ రైట్స్ కేసు విచారణ జరగనుంది. తన అనుమతి లేకుండా ఫోటోలు, పేర్లు, వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారని ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం విచారించనుంది. సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లలో తన వ్యక్తిగత చిత్రాలు, పేర్లు, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు.

సంబంధిత పోస్ట్