జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ తల్లి, మేనమామ, ఇద్దరు స్నేహితులతో సహా మరో నలుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికలను ట్రాప్ చేయడంలో అర్జున్, ప్రవీణ్ సోదరులకు ఈ నలుగురు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇప్పటికే అర్జున్, ప్రవీణ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సోదరులు అమ్మాయిలను ట్రాప్ చేసి, లైంగిక దాడులకు పాల్పడి, వీడియోలతో బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు వెల్లడైంది.