జూబ్లీహిల్స్: ఏటీఎం బద్దలు కొడుతూ చిక్కిన దొంగ

జూబ్లీహిల్స్ పోలీసులు ఏటీఎంను బద్దలుకొట్టి నగదు దోచుకెళ్లాలని ప్రయత్నించిన వేణుస్వామి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన వేణుస్వామి, సులువుగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో జూబ్లీహిల్స్లోని ఎస్బీఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు కర్ర, ఇనుప పరికరాలతో ఏటీఎం బాక్సును ధ్వంసం చేస్తూ నగదు దోచుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు, పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.

సంబంధిత పోస్ట్