టెర్రస్ నుంచి జారి పడి వ్యక్తి మృతి!

బంజారాహిల్స్ పరిధిలో టెర్రస్ పై నుంచి జారిపడి సెక్యూరిటీ గార్డు ఉపేందర్ సింగ్ రాథోడ్ మృతి చెందాడు. హరియాణాకు చెందిన ఉపేందర్, అతని భార్య కృతిక బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి డ్యూటీ ముగించుకుని వచ్చిన ఉపేందర్ భోజనం చేసి నిద్రపోయాడు. ఆదివారం ఇద్దరు వ్యక్తులు వచ్చి కృతికకు భర్త టెర్రస్ పై నుంచి పడిపోయాడని తెలిపారు. కిందకు వెళ్లి చూసేసరికి ఉపేందర్ అనేక గాయాలతో మృతి చెంది ఉన్నాడు. కృతిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్