యూసుఫ్ గూడలో రూ. 95.75 లక్షల వ్యయంతో కమలాపూర్ కమ్యూనిటీ హాల్ పక్కన నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మేయర్ తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కలెక్టర్ హరిచందన, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు, అజారుద్దీన్, నవీన్ యాదవ్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.